ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:22 AM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తొలిగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.

  • కనకదుర్గమ్మ సేవలో సీపీ రాధాకృష్ణన్‌

అమరావతి(ఆంధ్రజ్యోతి), విజయవాడ, జూన్‌ 28: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తొలిగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఈవో కేఎస్‌ రామారావు, అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో, గవర్నర్‌కు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనకు చంద్రబాబు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ స్వాగతం పలికి నివాసంలోకి తీసుకువెళ్లారు. చంద్రబాబు ఆయనకు జ్ఞాపిక బహుకరించగా... లోకేశ్‌ మంగళగిరి చేనేత శాలువాను కప్పి సత్కరించారు. సుమారు రెండు గంటలపాటు ఆయన చంద్రబాబు నివాసంలో ఉన్నారు. అనంతరం హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు ఒకటికి రెండుసార్లు తెలంగాణ గవర్నర్‌ను కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆహ్వానంపై గవర్నర్‌ వచ్చారని, ఇది మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 29 , 2024 | 05:22 AM

Advertising
Advertising