ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Govt School : ఆ బడిలో ఒకే ఒక్కడు!

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:33 AM

అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.

  • మరో పాఠశాలలో ముగ్గురే విద్యార్థులు

  • విశాఖ జిల్లాలోని ఏకోపాధ్యాయ బడుల దుస్థితి

పెదగంట్యాడ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!. ఇదీ విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం మరడ దాసరిపేట, మరుబాయి గ్రామాల్లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లోని పరిస్థితి. మరడ దాసరిపేట పాఠశాలలో అన్ని వసతులూ ఉన్నాయి. అయితే ఇక్కడ నాలుగో తరగతి చదువుతున్న ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. అలాగే మురుబాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులకు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇంకో చిన్నారిని వారం రోజులుగా అనధికారికంగా పాఠశాలకు వస్తోంది. ఆ చిన్నారితో కలుపుకొన్నా ఇక్కడ చదివేది నలుగురే!. ఈ రెండూ ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఒకవేళ ఉపాధ్యాయులు రాకుంటే పాఠశాలకు సెలవే. దీంతో తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు.

  • ఆసక్తి చూపని తల్లిదండ్రులు!

వాస్తవానికి మరడ దాసరిపేట, మరుబాయి గ్రామాల్లో 30 మందికి పైగా చిన్నారులు ఉంటారు. వీరిని స్థానికంగా ఉన్న పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో ప్రయత్నించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకుగాను గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేస్తామని పెదగంట్యాడ ఎంఈవో శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - Dec 14 , 2024 | 05:33 AM