Share News

YCP: ఓటుకు నోటు కేసు.. ఇకపై వాయిదాలు ఉండవు: ఆళ్ల రామకృష్ణా రెడ్డి

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:57 PM

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.

YCP: ఓటుకు నోటు కేసు.. ఇకపై వాయిదాలు ఉండవు: ఆళ్ల రామకృష్ణా రెడ్డి

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు (Vote for Note Case) పై సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Alla Ramakrishna Reddy) స్వాగతించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలను మేనేజ్ చేయగలరు కాబట్టే ఓటుకు నోటు కేసు ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందన్నారు. ఇకపై వాయిదాలు ఉండవని గురువారం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.


టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరపు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు వాయిదా కోరడంతో ఈరోజు కేసు వాయిదా పడిందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆడియో, వీడియోలతో దొరికిపోయారన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ (Jagan) నిర్దోషి అని అన్నారు. ఏపీలో చంద్రబాబు ఓటమి తధ్యమని.. మరోసారి జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని ఆళ్ల రామకృష్ణ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.


కాగా ఓటుకు నోటు కేసులోకీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది.


ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ కేసు.. ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ సర్కార్ కోరింది.

అయితే, రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేనందున సెలవుల అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీంతో సుప్రీం కోర్టు కేసు విచారణను ఈ మేరకు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆ అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది..

రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

Updated Date - Apr 18 , 2024 | 02:00 PM