AP News: అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా
ABN, Publish Date - Jul 09 , 2024 | 07:28 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. వాస్తవానికి ఆయన రిటైర్ అయ్యారు. గత ప్రభుత్వం అతనిని కొనసాగించింది. రిటైర్ అయిన తర్వాత కొనసాగుతోన్న అధికారులు రాజీనామా చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. వాస్తవానికి ఆయన రిటైర్ అయ్యారు. గత ప్రభుత్వం అతనిని కొనసాగించింది. రిటైర్ అయిన తర్వాత కొనసాగుతోన్న అధికారులు రాజీనామా చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దాంతోపాటు అసెంబ్లీ నిర్వహణలో రామాచార్యుల వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. అతని తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహాంతో ఉన్నారు. రాజీనామా చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రామాచార్యులు రాజీనామా చేశారు. తన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోసెన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు.
Updated Date - Jul 09 , 2024 | 07:29 PM