ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: అనధికార లే అవుట్లపై చర్యలు..

ABN, Publish Date - Aug 22 , 2024 | 08:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార లే అవుట్లపై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేని లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

Minister Narayana

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార లే అవుట్లపై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేని లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. పురపాలక, నగర పాలక సంస్థల పరిధిలో అనధికారిక లే అవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాల్టీల్లోని లే అవుట్లలో 50 శాతం మేర అనధవికారిక లే అవుట్లు ఉన్నాయని మున్సిపల్ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీంతో అనధికారిక లే అవుట్ల ముందు బోర్డులు పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇప్పటికే వివిధ మున్సిపాల్టీల పరిధిలో అనుమతులు లేని లే అవుట్ల సమాచారాన్ని ప్రకటనల రూపంలో మున్సిపల్ శాఖ వెల్లడిస్తోంది. అనధికారిక లే అవుట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపాల్టీల్లోని అనధికారిక లే అవుట్లతో పాటు వివిధ అర్బన్ అథారిటీల పరిధిలో వేసిన అనధికారిక లే అవుట్ల మీద మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టిందన్నారు. అర్బన్ అథారిటీల పరిధిలో 50 శాతానికి మించి అనధికారిక లే అవుట్లు ఉంటాయని మున్సిపల్ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం


యథేచ్ఛగా అక్రమ లే అవుట్లు..

రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో యథేచ్ఛగా అక్రమ లే అవుట్లు వెలిశాయి. ముఖ్యంగా కొందరు ప్రజాప్రతినిధుల అండతో వారి అనుచరులు ఈ అక్రమ లేవుట్లు వేసి విక్రయించేశారు. ప్రభుత్వంలో ఉండటంతో అధికారులు సైతం ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్లు వేశారనే ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం, అధికారులు స్పందించలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు రియల్టర్లు నాలా కన్వర్షన్‌ లేకుండానే అనధికార లేఅవుట్లు వేసి విక్రయించినట్లు తెలుస్తోంది.

Chandrababu: ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది


కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత..

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేని లే అవుట్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అధికారులు అక్రమ లే అవుట్ల వివరాలు సేకరిస్తున్నారు. సామాన్య ప్రజలు అక్రమ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలుచేసి మోసపోతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు మోసపోకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో భారీగా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు తెలుస్తోంది. ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.


CM Chandrababu: కోనసీమ జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 08:28 PM

Advertising
Advertising
<