ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Undavalli And Brother Anil: రాజమండ్రిలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ.. ఎందుకంటే..?

ABN, Publish Date - Jan 12 , 2024 | 07:59 PM

ప్రముఖ బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్‌ బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ( Brother Anil Kumar )తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. వివాహనికి సంబంధించిన ఏర్పాట్లకు బ్రదర్ అనిల్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

రాజమండ్రి: ప్రముఖ బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్‌ బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ( Brother Anil Kumar )తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. వివాహనికి సంబంధించిన ఏర్పాట్లకు బ్రదర్ అనిల్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ కుమార్ శుక్రవారం నాడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun Kumar ) నివాసంలో కలిశారు. వీరిద్దరూ కాసేపు రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనిల్ మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఉండవల్లి ఇంటికి వచ్చాను. నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉన్నాను. ఏసుప్రభు గురించి చెప్పడానికే మాత్రమే నేనున్నాను. రాజకీయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడను’’ అని బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు.

నేను కాంగ్రెస్‌లో చేరను : ఉండవల్లి

పెళ్లికి పిలవడానికి మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్‌ ( Brother Anil Kumar ) తన మీద గౌరవంతో ఇంటికి వచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun Kumar ) తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలు ఉంటాయని.. అదే కాంగ్రెస్ బలమని.. అందరూ ఒకటైతే పార్టీ అవదని.. మిలిటరీ అవుతుందని చెప్పారు. షర్మిల రాజశేఖర్‌రెడ్డి కూతురు.. ఆమె కాంగ్రెస్ పార్టీ మెంబర్‌గానే ఉన్నారని చెప్పారు. బహిష్కృత ఎంపీలను కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉందన్నారు. తాను పలువురిపై కేసులు వేశానని.. ఈ విషయం కోర్టులో ఉందన్నారు. తనను తీసుకొనే అవకాశం కాంగ్రెస్‌కు ఉండదని తాను రాజకీయాల నుంచి రిటైడ్ అయిపోయానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 08:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising