ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:14 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. .ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు (సోమవారం) జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ.. పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్‌ ఉన్నాయి. పింఛన్ల పథకానికి ఎన్టీఆర్‌ భరోసాగా ఇప్పటికే పేరు మార్పు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు.


183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజున ఒకేసారి ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. జిల్లాలకు రేపు లేదా ఎల్లుండి ఇన్చార్జిలను నియమిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.చంద్రబాబు

Updated Date - Jun 24 , 2024 | 03:30 PM

Advertising
Advertising