Chandrababu: జగన్ ఏపీని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు
ABN, Publish Date - Jan 05 , 2024 | 06:36 PM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కనిగిరిలో సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసభకు టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సైకోకి భయపడను. సైకో పోవాలి.... సైకిల్ రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కనిగిరిలో సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సైకోకి భయపడను. సైకో పోవాలి.... సైకిల్ రావాలి. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా....ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వా కనిగిరి రూపురేఖలు మారుస్తాను. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి జగన్ ఇప్పుడు 10రూపాయలు ఇచ్చి.. 100 దోచుకుంటున్నారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు... ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది’’ అని చంద్రబాబు తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో అన్నీ వీరబాదుడే...
‘‘2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు.... ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే....జగన్ గంజాయి ఇస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయి. చెత్త నుంచి సంపద సృష్టించాలని మేం ప్రయత్నించాం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు. జగన్ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తం తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Jan 05 , 2024 | 06:47 PM