ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Chandrababu: నూతన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం..

ABN, Publish Date - Jun 12 , 2024 | 08:30 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM chandrababu) భేటీ అయ్యారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంసం అనంతరం రాష్ట్ర పునఃనిర్మాణంలో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై వారితో చర్చించారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.

AP CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM chandrababu) భేటీ అయ్యారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంసం అనంతరం రాష్ట్ర పునఃనిర్మాణంలో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై వారితో చర్చించారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.


మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

మాజీ ముఖ్యమంత్రి జగన్(Former CM Jagan) వద్ద ఆయన మంత్రుల(Ministers) వద్ద పని చేసిన ఏ స్థాయి సిబ్బందినీ పనికి పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. గత వైసీపీ మంత్రుల వద్ద ఉన్న ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వారిప్పుడు మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తారని, దరిచేరనీయెుద్దని ఆదేశించారు.


పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. తాను సీఎంగా ఉన్న నాటి పరిస్థితి, నేటి రాష్ట్ర పరిస్థితులపై మంత్రులతో కలిసి ఆయన విశ్లేషించారు.

మంత్రుల అభీష్టం, వారి సమర్ధత ఆధారంగా గురువారంలోగా శాఖలు కేటాయిస్తామని తెలిపారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రులకు చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై పూర్తి దృష్టి పెట్టాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.

ఇది కూడా చదవండి:

AP Govt: వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్న టీడీపీ ప్రభుత్వం..

Updated Date - Jun 12 , 2024 | 09:13 PM

Advertising
Advertising