ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:07 AM

అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.

అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం (NDA Kutami Govt.) అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఇవాళ (బుధవారం) కూటమి ఎమ్మెల్యేలతో (MLAs) ప్రత్యేక భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకుపైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మినహా మిగతా మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం మంగళగిరి, డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని వెల్లడించాయి.

మరోవైపు ఈ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్‌ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. సమయానికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని యోచిస్తున్నారు.

ఇంకోవైపు.. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ బుధవారం మరోసారి భేటీ కానుంది. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు. అక్టోబర్ 1నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్.. నూతన విధానంపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల మద్యం విధానంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. దీన్ని ఇవాళ క్యాబినెట్ ముందు పెట్టనున్నారు. దీనిపై చర్చ అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

గత పాలకుల నిర్లక్ష్యం.. ఏపీ ప్రజలకు శాపం..

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 18 , 2024 | 10:06 AM

Advertising
Advertising