ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: బయట పడుతున్న వైసీపీ అరాచకాలు.. టెన్షన్‌లో నేతలు..

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:21 PM

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తాము ఎలాంటి అక్రమాలు చేసినా.. అవి సక్రమాలే అవుతాయనే ఆలోచనతో..

YSRCP Leaders

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తాము ఎలాంటి అక్రమాలు చేసినా.. అవి సక్రమాలే అవుతాయనే ఆలోచనతో అప్పటి విపక్షాలు ఎన్ని విమ్రర్శలు చేసినా, తప్పులపై ప్రశ్నించినా వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగేవాళ్లన్న విషయం అందరికీ తెలిసిందే. తాము ఏం చేసినా చెల్లుతుందనే అహాన్ని ప్రదరర్శిస్తున్నారనే విమర్శలు కొందరు నేతలు ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల అండదండలతో కొందరు అధికారులు సైతం నిబంధనలు పక్కనపెట్టి.. నాయకులకు భజనచేయడానికి ఎక్కువ సమయం కేటాయించారనే ఆరోపణలు వినిపించాయి. నిబంధనలు పాటించని అధికారులు తమ తప్పులకు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని అప్పట్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ నేతలు హెచ్చరించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రజల విశ్వాసం కోల్పోవడంతో ఐదేళ్లకే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. మెజార్టీ సీట్లు దక్కించుకోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అరాకచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏ ప్రభుత్వ శాఖను కదిలించినా గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాల చిట్టా బయటకు వస్తున్నాయట.
NV Ramana: చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామం


పౌరసరఫరాల శాఖలో..

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖను కేటాయించారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కువుగా రేషన్ దుకాణాలు, స్టాక్ పాయింట్లు తనిఖీ చేస్తున్నారు. ఆయన సోదాల్లో రేషన్ పంపిణీలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లబ్ధిదారులకు కందిపప్పు, షుగర్ పరిమాణం తగ్గించి ఇచ్చినట్లు తనిఖీల్లో తేలింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో క్షేత్రస్థాయిలో ఈ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా బియ్యం రీసైక్లింగ్‌కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.


మిగతా శాఖల్లో..

కేవలం అక్రమాలు, అవినీతి ఏదో ఒక శాఖకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ప్రతి విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం జరిగినట్లు అనేక ఆరోపణలు గత ప్రభుత్వంపై వచ్చాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో నిధుల మళ్లింపు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై విచారణ చేసి బాధితులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.


శ్వేత పత్రాల విడుదలతో..

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ కీలక విభాగాల్లో గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసంతో పాటు.. అవకతవకలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. శ్వేతపత్రాల ద్వారా ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో గత ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న తప్పులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Viral News: తీరిన 15 ఏళ్ల కల.. విగ్రహంతో పెళ్లి.. కారణం ఇదే!


వైసీపీ నేతల్లో టెన్షన్..

ప్రతి ప్రభుత్వ విభాగంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేయడంతో కొంతమంది అవినీతి నాయకులు, అధికారులు టెన్షన్ పడుతున్నారట. పైకి తమకు సంబంధం లేదని అంటున్నా.. లోలోపల మాత్రం ఎవరు ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందోననే ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే పూర్తైన నేపథ్యంలో మరో నాలుగైదు నెలల్లో ఈ ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేదానిపై క్లారిటీ రానుంది.


Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ గూటికి గాంధీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 13 , 2024 | 05:21 PM

Advertising
Advertising
<