Share News

CPI: కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ

ABN , Publish Date - May 19 , 2024 | 12:57 PM

గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.

CPI: కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ

గుంటూరు జిల్లా: కేంద్రంలో (Central), రాష్ట్రంలో (State) ప్రభుత్వం మారే అవకాశం (Change of Government) ఉందని, మోదీ డబుల్ ఇంజన్ (Modi Double Engine) అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (Narayana) కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్బంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏకు 400 సీట్లు వస్తయంటూ ప్రధాని మోదీ (PM Mo0di) మైండ్ గేమ్ (mind game) ఆడుతున్నారని.. వాస్తవానికి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. ఉత్తర భారత దేశంలోనూ ఎన్డీ (NDA)కి భారీగా సీట్లు తగ్గనున్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకు సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పుణ్యమా అని ఒకటి రెండు సీట్లు రావచ్చునని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కక్షపూరితంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.


సీపీఐ నేత (CPI Leader) ముప్పాళ్ళ నాగేశ్వరరావు (Muppalla Nageswara Rao) మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో ఎన్నికల ముందు.. ఎన్నికల అనంతరం గొడవలు, దాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పిన్నెల్లి, కాసు రాజకీయ కక్షలను బయటకు తీసి దాడులు జరిగేందుకు ఆజ్యం పోశారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న డీజీపీ ఉత్సవ విగ్రహంలా ఉన్నారని.. సీఎస్‌ను ఎప్పుడో మార్చాల్సిందని అన్నారు. రాబోయే ప్రజా తీర్పులో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉంటుందని ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 12:58 PM