ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: రేపటినుంచి ఉచిత సిలిండర్

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:54 AM

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ధరఖాస్తు దారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటిలాగే మొబైల్ నంబర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో గ్రామాల్లో.. రెండు రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది.

Free Gas Cylinder

అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. నిన్న (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికీ కొందరికీ ఫ్రీ గ్యాస్ ఎలా తీసుకోవాలనే సందేహాం కలుగుతుంది. ఏయే పత్రాలు ఇవ్వాలి..? అని అడుగుతున్నారు.



ఆ మూడు పత్రాలు

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ధరఖాస్తు దారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటిలాగే మొబైల్ నంబర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో గ్రామాల్లో.. రెండు రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఒకవేళ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్ డబ్బులు తీసుకుంటే రెండురోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో రూ.851 జమ అవుతుంది.



ఈ కేవైసీ చేయాలి..

గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని డీలర్ వద్దకెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో అప్ డేట్ అవుతుంది. ఆ లోపు సిలిండర్ వస్తే డబ్బులు చెల్లించాలి. కేవైసీ పూర్తయిన తర్వాత.. సిలిండర్‌కు లబ్దిదారుడు ఇచ్చిన నగదు వారి ఖాతాలో జమ అవుతుంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి సమస్య ఉంటే 1967 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.



మూడు సిలిండర్లు

ఫస్ట్ సిలిండర్ మార్చి 31వ తేదీ లోపు బుక్ చేసుకోవాలి. రెండో సిలిండర్ జూలై 31వ తేదీ లోపు బుక్ చేయాలి.. చివరి సిలిండర్ నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:
వంశీ కోసం.. లాయర్‌ వేషం

పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి

జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్‌


మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 30 , 2024 | 12:45 PM