ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yarapatineni: సీఎం ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:26 PM

Andhrapradesh: గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం సాగర్‌ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రెండు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వైసీపీ నేతలు వారి పాలన మొత్తం అరాచకాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Yarapathineni srinivas

పల్నాడు జిల్లా, డిసెంబర్ 21: నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక శనివారం జరిగింది. చైర్మన్‌గా పులుకూరి కాంతారావు, వైస్ ఛైర్మన్‌గా ఉప్పలపాటి చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిరువురికి కలెక్టర్ అరుణ్ బాబు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Gurajala MLA Yarapatineni Srinivas rao) ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం సాగర్‌ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

CM Revanth Reddy: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక ప్రకటన



రెండు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వైసీపీ నేతలు వారి పాలన మొత్తం అరాచకాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ఎన్నిక జరిగిందని తెలిపారు. రైతులను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం కాపాడుతోందన్నారు. రైతుల విషయంలో చంద్రబాబు ఆశయాలు ముందుకు తీసుకెళతామని యరపతినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

జగన్‌కు చంద్రబాబు బర్త్‌ డే విషెస్


నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు మాట్లాడుతూ.. టీడీపీలో గత ముప్పై ఏళ్ళుగా పనిచేయడం తన అదృష్టమన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. గత ఐదేళ్లుగా ఆయకట్టు కింద రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. చివరి భూముల వరకూ నీరందించేంచుకు కృషి చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం తనపై ఎంతో గురుతర బాధ్యతని ఉంచిందన్నారు. రైతు సమస్యల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని పులుకూరి కాంతారావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నిధుల మంజూరు, ఇతర పనులపై ఆరోపణలు

ఇదేం విన్యాసంరా బాబోయ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 01:26 PM