AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో హైకోర్టు అసహనం.. కారణమిదే..?
ABN, Publish Date - Mar 05 , 2024 | 10:52 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతాపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేసు పెట్టిన కృష్ణారెడ్డి తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని హైకోర్ట్ ప్రశ్నించింది.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతాపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేసు పెట్టిన కృష్ణారెడ్డి తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని హైకోర్ట్ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని లేని పక్షంలో హత్య కేసులో ఇరికిస్తామని తనను బెదిరించారని కోర్ట్‌ను కృష్ణారెడ్డి ఆశ్రయించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ కోర్ట్ ఆదేశించింది.
సీబీఐ SP రాంసింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డిలపై పోలీస్‌లు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పులివెందుల మేజిస్ట్రేట్ ఉత్తర్వులు, పోలీస్‌లు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని హైకోర్ట్‌ను సునీత దంపతులు ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం ఇంత సమయం ఇచ్చినా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్ట్ ప్రశ్నించింది.పిటిషనర్లు, పోలీస్‌లు, కృష్ణారెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు కృష్ణారెడ్డి తరపు న్యాయవాదికి సమయం ఇస్తూ విచారణ మార్చ్ 13వ తేదీకు హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - Mar 05 , 2024 | 10:52 PM