ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

ABN, Publish Date - Sep 23 , 2024 | 02:11 PM

పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు..

Janasena

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఏ వైసీపీ నాయకుడు నోరు విప్పినా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేవాళ్లు. 2019 నుంచి 2024 వరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైసీపీ రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసింది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ ఎక్కడా బెదరలేదు. ప్రతి విమర్శకు సమాధానం చెబుతూ గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని, ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండబోదంటూ వైసీపీ అధ్యక్షులు జగన్‌తో సహా ఆ పార్టీలో సీనియర్ నేతలంతా ఇదే మాట చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన నాయకులు నేడు అడ్రస్ లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఆవేశం, అధికారం ఉందనే అహంకారం పనికిరాదని.. ఏదైనా ఆలోచించి చేయాలనేది పవన్ కళ్యాణ్ తీరు చూస్తే అర్థమవుతోంది. విపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలో ఉన్నప్పుడు పవన్ వ్యవహారశైలిలో పెద్దగా మార్పు కనిపించడం లేదట. ఎప్పుడైనా పేదవాడికి న్యాయం జరగాలనేది పవన్ సిద్ధాంతంగా పెట్టుకోవడంతోనే రోజురోజుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే చర్చ జరుగుతోంది.

Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం


జనసేనకు డిమాండ్..

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక కొందరు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి, కిలారి రోశయ్యతో పాటు మరికొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుకు జనసేననే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఇప్పుడు జనసేనకు జై కొడుతూ ఆ పార్టీలో చేరుతున్నారు. జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ మాట్లాడిన వాళ్లే తమ రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోకి క్యూకడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Big Breaking: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం


పరిమితులు పెట్టడంతోనే..

జనసేనలోకి వచ్చేందుకు వైసీపీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ విధించిన పరిమితులతో అందరినీ చేర్చుకోవడంలేదట. ముఖ్యంగా అధికారం ఉందనే అహంకారంతో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులకు పాల్పడిన వైసీపీ నేతలను చేర్చుకోకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులను దూరం పెట్టాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పార్టీ సీనియర్లకు చెప్పారట. ఎక్కడైనా ఇతర పార్టీల నుంచి కొత్త నాయకులను చేర్చుకుంటే అక్కడ ఇప్పటికే ఉన్న స్థానిక నాయకుల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో ఎక్కువమంది పార్టీలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా పవన్ పెట్టిన పరిమితులతో కొందరికే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.


AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 23 , 2024 | 02:43 PM