Nadendla Manohar: జనంలోకి జనసేనాధిపతి.. కార్యాచరణ సిద్ధం
ABN, Publish Date - Jan 21 , 2024 | 10:11 PM
జనంలోకి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వస్తున్నారని.. కార్యాచరణ సిద్ధం చేశామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.
అమరావతి: జనంలోకి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వస్తున్నారని.. కార్యాచరణ సిద్ధం చేశామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మనోహర్ మాట్లాడుతూ... క్షేత్ర స్థాయి పర్యటనలకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని చెప్పారు. రోజుకి మూడు సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. పవన్ పర్యటనల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా బహిరంగ సభలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ అన్నారు.
సభలు, సమావేశాలను విజయవంతం చేసే బాధ్యత జోనల్ కమిటీలకు అప్పగిచ్చినట్లు తెలిపారు. మరో 2 నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే విజయం టీడీపీ, జనసేనదేనని చెప్పారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి బాధ్యతలు అప్పగిచ్చారని చెప్పారు. గతంలో కాకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. పవన్ సభలకు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు.. ఆయన బాధితులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
Updated Date - Jan 21 , 2024 | 10:30 PM