ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: తల్లి బహిరంగ లేఖతో జగన్‌లో కొత్త టెన్షన్..

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:30 PM

జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం..

YS Jagan

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొద్దిరోజులుగా నడుస్తోంది. ఆస్తుల వివాదంపై జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది. జగన్ పిటిషన్‌పై షర్మిల స్పందించగా.. వైసీపీ కౌంటర్ ఇస్తూ షర్మిల జగన్‌పై కుట్ర చేస్తుందంటూ ప్రెస్‌మీట్లు పెట్టారు. వైసీపీ నేతలు జగన్ వైఖరిని సమర్థిస్తూ షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు షర్మిల సైతం ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. జగన్, షర్మిల ఆస్తుల వివాదాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేయడం ప్రారంభించారు. రాజకీయంగా జగన్‌ను దెబ్బతీసేందుకు షర్మిల ఎవరితోనో చేతులు కలిపారంటూ వైసీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందేం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన ఆస్తుల వివాదంపై ఒంటరి పోరాటం చేస్తోంది. మరోవైపు జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన తప్పులు తెలియకుండా దీనిని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూనేఉన్నారు. ఆస్తులు పంచుకుందామని 2019లో ప్రతిపాదన తీసుకువచ్చి.. దానికి అనుగుణంగా ఎంవోయూ చేసుకున్న తర్వాత షర్మిల తనపై కుట్ర చేస్తోందంటూ జగన్ మాట్లాడటం సరికాదని స్వయంగా జగన్ తల్లి విజయలక్ష్మి బహిరంగ లేఖలో తెలిపారు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న విజయలక్ష్మి.. తన పిల్లల ఆస్తుల వివాదంపై బహిరంగ లేఖ విడుదల చేయడంతో జగన్‌లో కొత్త టెన్షన్ మొదలైందనే చర్చ జరుగుతోంది.


టెన్షన్.. టెన్షన్

జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్నా.. దీనిని మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కుటుంబ సమస్యగానే చూశారు. కానీ ఈ ఆస్తుల వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో వైసీపీ, షర్మిల మధ్య వార్గా మారింది. ఎవరికి వారు తమదే ఒప్పంటే.. తమదే ఒప్పని వాదించుకుంటూ వచ్చారు. ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ వచ్చారు. కుటుంబ వివాదం కావడంతో కుటుంబ సభ్యులకే అన్ని విషయాలు తెలిసి ఉంటుంది. ఈ క్రమంలో జగన్, షర్మిల తల్లి విజయలక్ష్మితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలు తెలిసి ఉంటాయి. దీంతో షర్మిల, జగన్ మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను విజయలక్ష్మి బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుంచారు. జగన్ మొదట ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆస్తులు పంచుకుందామనే ప్రతిపాదన ఎప్పుడు, ఎక్కడ తీసుకువచ్చారు. దానికోసం వైసీపీ అధ్యక్షులు జగన్ ఎలాంటి కారణాలు చెప్పారనేది విజయలక్ష్మి తన లేఖలో ప్రస్తావించారు. దీంతో ఆస్తుల వివాదానికి సంబంధించిన అసలు విషయం బయటకువచ్చింది. విజయలక్ష్మి తన లేఖలో ప్రస్తావించిన అంశాలను చూసిన తర్వాత షర్మిలకు జగన్ అన్యాయం చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. దీంతో సొంత చెల్లికి జగన్ అన్యాయం చేశారనే అభిప్రాయం ఎక్కువమంది రాష్ట్ర ప్రజల్లో కలిగితే తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన జగన్‌లో మొదలైనట్లు తెలుస్తోంది.


సమస్యను పరిష్కరించుకుంటారా..

ఇప్పటికైనా వైసీపీ అధ్యక్షులు జగన్ తన సోదరి షర్మిలతో ఆస్తుల వివాదాన్ని పరిష్కరించుకుంటారా లేదంటే మొండివైఖరినే అవలంభిస్తారా అనేది తేలాల్సిఉంది. ఓవైపు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవల్సిన కుటుంబ సమస్యను రాజకీయం చేయడం ద్వారా షర్మిలను తన అన్న జగన్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారా లేదంటే షర్మిలకు ఆస్తులు ఇవ్వకుండా ఆమెను ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రకు తెరలేపారా అనే చర్చ జరుగుతున్న వేళ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 30 , 2024 | 03:30 PM