ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme Court: 16న చంద్రబాబు స్కిల్ కేసులో తీర్పు

ABN, Publish Date - Jan 13 , 2024 | 04:47 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలపెమెంట్ కేసు ( Skill Development Case ) లో సుప్రీం కోర్టు ( Supreme Court ) 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నది.

ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలపెమెంట్ కేసు ( Skill Development Case ) లో సుప్రీం కోర్టు ( Supreme Court ) 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నది. స్కిల్ కేసులో FIR రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువడనున్నది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఇవ్వనున్నది. అక్టోబర్ 20వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

స్కిల్ కేసులో FIR రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా..కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు పిటిషన్ వేశారు. 16వ తేదీ న ఉదయం 10:30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ కేసు విచారణ చేపడతామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 13 , 2024 | 05:56 PM

Advertising
Advertising