Pawan Kalyan: టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం నిర్వహించిన పవన్.. ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Jul 10 , 2024 | 08:36 PM
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు(Zoo Parks) అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు(Zoo Parks) అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆదేశించారు. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు "టీ విత్ డిప్యూటీ సీఎం" కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని, రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జూపార్కులకు ఎక్కువ మంది వచ్చేలా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతి(వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
CM Chandrababu: బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ..
అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని, ప్రతి రోజూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మండలి అధికారిక వెబ్‌సైట్ రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి
Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..
Updated Date - Jul 10 , 2024 | 08:36 PM