ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: పొన్నవోలుకు ఏబీఎన్ ప్రతినిధి షాక్.. ఆవేశంగా ఊగిపోయిన సుధాకర్ రెడ్డి

ABN, Publish Date - Oct 17 , 2024 | 04:58 PM

సజ్జలతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున వచ్చారు. సజ్జలతో పాటు వైసీపీ నాయకులు స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని తెలిపారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పోలీసులపై..

Ponnavolu

ఏపీ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామాకు తెరలేపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సజ్జలతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున వచ్చారు. సజ్జలతో పాటు వైసీపీ నాయకులు స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని తెలిపారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పోలీసులపై వేలు చూపిస్తూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలతో పాటు తనను లోపలికి అనుమతించలేదని పొన్నవోలు తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీచేస్తే 10వ తేదీన లుక్‌అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు ఇచ్చామన్నారు. పోలీసులకు విచారించే అధికారం ఉన్నట్లే నిందితులకు హక్కులు ఉంటాయన్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసును రకరకాలుగా తిప్పుతున్నారన్నారు. మూడేళ్ల క్రితం ముగిసిన కేసుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పొన్నవోలు ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.


పొన్నవోలుకు ఏబీఎన్ ప్రతినిధి షాక్..

ఆధారాలు లేకుండా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏబీఎన్ ప్రతినిధి షాక్ ఇచ్చారు. ఏ ఆధారాలతో పొన్నవోలుపై కేసు నమోదు చేశారనగానే.. చంద్రబాబుపై ఏ ఆధారాలతో కేసు నమోదు చేశారని ఏబీఎన్ ప్రతినిధి ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆవేశంగా ఊగిపోయారు. ఆ కేసు గురించి నీకేం తెలుసంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసు గురించి మాట్లాడటం అప్రస్తుతమంటూ పొన్నవోలు ఊగిపోయారు. సరైన సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగారు.


ఆధారాలు లేకుండానే..

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంతో మందిపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎంతోమంది రాజకీయ నాయకులతో పాటు పార్టీ నాయకులపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టి వేధించారనే విమర్శలు లేకపోలేదు. అక్రమ కేసులతో ఎంతోమందిని వేధించిన ఘటనలు ఉన్నాయి. అప్పుడు నోరెత్తని వారంతా ప్రస్తుతం పూర్తి ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తుంటే మాత్రం విమర్శలు చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికిదిగారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదైనా ఇప్పటి వరకు విచారణ చేయలేదు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని తాజాగా గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆపార్టీ నేతలు నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురామ్‌లను ఇప్పటికే ఫలు దఫాలుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 17 , 2024 | 04:58 PM