ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guntur: అరుదైన అవార్డు దక్కించుకున్న తెలుగు కవి ఎవరంటే..

ABN, Publish Date - Dec 18 , 2024 | 05:09 PM

ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ప్రస్తుతం పెనుకొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

Writer Penukonda Lakshminarayana

గుంటూరు: ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణ (Penukonda Lakshminarayana)కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Kendra Sahitya Academy Award) లభించింది. "దీపిక" అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ప్రస్తుతం పెనుకొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెం. కాగా, లక్ష్మీనారాయణ దాదాపు 46 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. ఆయన అనేక రకాల విమర్శనాత్మక గ్రంథాలు రచించారు. అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు నేతృత్వం వహించారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణకు అవార్డు రావడంతో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, పలువురు ప్రముఖులు సైతం ఆయన్ను అభినందిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 05:25 PM