ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభకు రావొద్దంటూ మీడియాపై ఆంక్షలు

ABN, Publish Date - Mar 10 , 2024 | 11:49 AM

అమరావతి: వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు.

అమరావతి: వైసీపీ (YCP) ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియా (Media)పై ఆంక్షలు విధిస్తున్నారు. బాపట్ల (Bapatla)లో జరిగే సిద్ధం సభ కవరేజీకి రావొద్దంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా ప్రతినిధులను హెచ్చరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మీడిపై ఆంక్షలు విధించడంపై జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ (CM Jagan) పర్యటన ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతోంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభ (Siddam Sabha)కు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు (YCP Leaders) తీవ్ర తంటాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు స్కూలు బస్సులను తెప్పించి జనాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బస్సులన్నీ సభకు తరలి వెళ్లడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సిద్ధం సభ పెట్టిన ప్రతీసారి తమకు కష్టాలు తప్పడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీమిలి, ఏలూరు, రాప్తాడులో సీఎం జగన్ మూడోచోట్ల సిద్ధం సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా, మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ సిద్ధం సభ కవరేజీకి వెళ్లొద్దని మీడియాకు పోలీసులు నోటీసులు (Notices) జారీ చేశారు. నోటీసులు తీసుకోవాలని మీడియా ప్రతినిధులకు పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. సిద్ధం సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చారు. యూటీఎఫ్‌, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా వైసీపీ శ్రేణులు సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు తరలించారు. దీంతో బస్సులు లేక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Mar 10 , 2024 | 11:51 AM

Advertising
Advertising