ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

ABN, Publish Date - Nov 02 , 2024 | 10:42 AM

Andhrapradesh: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు బాధాకరమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు.

Speaker Ayyannapatrudu

పల్నాడు జిల్లా, నవంబర్ 2: నరసారావుపేట ప్రభుత్వాస్పత్రిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపుపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు AP (Assembly Speaker Ayyannapatrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కృషి వల్లే నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అయ్యిందన్నారు. అమెరికాలో చదువుకుంటున్న తన స్నేహితుల నుంచి తీసుకొచ్చిన చందాలతో పల్నాడు ప్రాంత ప్రజల కోసం కోడెల శివప్రసాద్‌ సకల సౌకర్యాలతో పెద్ద ఆస్పత్రి నిర్మాణం చేయించారన్నారు.

Electricity Scam: కేసీఆర్‌పై చర్యలు?


అలాంటి వ్యక్తి విగ్రహం తొలగింపు బాధకరమన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు అంతా చర్చించుకుని కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని పున:ప్రతిష్ట చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..



వారంతా పద్ధతి మార్చుకోవాలి: శివరాం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు అంశం వివాదంగా మారింది.. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారు. విగ్రహం తొలగింపుపై కోడెల కుమారుడు శివరాం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహం తొలగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అధికారుల తీరు మారలేదని కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోడెల పట్ల వివక్షత మంచిది కాదని హెచ్చరించారు. కోడెల విగ్రహం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించే ప్రతీ ఒక్కరూ తమ పద్దతి మార్చుకోవాలన్నారు.


పల్నాడు గడ్డపై తెలుగుదేశం పార్టీ అనగానే గుర్తుకువచ్చేది కోడెల శివప్రసాద్. నరసరావుపేటలో ఉన్న 200 పడకల ఆస్పత్రి ఒకప్పుడు అన్యాక్రాంతమైన స్థలమని.. భవిష్యత్‌లో పేదల గురించి ఆలోచించిన కోడెల అన్యాక్రాంతమైన స్థలాన్ని రెగ్యులరైజ్ చేసి నాబార్డ్ నిధులతో ఆస్పత్రిని నిర్మించారని తెలిపారు. అలాంటి చోట కోడెల విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన రాకపోవడం బాధాకరమన్నారు. సొంతగడ్డపై కోడెలకు గుర్తింపు కలుగకుండా కొందరు కుట్ర చేస్తున్నారని.. అందుకు గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను అడ్డుపెట్టుకుని ఈ తంతంగాన్ని నడిపిస్తున్నారని కోడెల శివరాం విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 10:57 AM