AP News: తగులబడిన టీడీపీ కార్యకర్త బైక్.. వైసీపీ పనేనా?
ABN, Publish Date - Feb 02 , 2024 | 10:17 AM
Andhrapradesh: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు.
పల్నాడు, ఫిబ్రవరి 2: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాదం రాంబాబుకు చెందిన ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. అయితే ఉదయం లేచి చూడగా ద్విచక్ర వాహనం తగలబడి కనిపించింది. నిన్న (గురువారం) టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటున్న తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఓర్వలేక వైసీపీ నాయకులు ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 02 , 2024 | 10:45 AM