TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి
ABN, Publish Date - Apr 25 , 2024 | 01:13 PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ (Pattabhiram) తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర (Padayatra) పేరుతో ‘నాడు మార్నింగ్ (Morning Walk), ఈవినింగ్ వాక్ (Evening Walk)’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు (Assets), స్థలాలు (Places) ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఏయే భూములు దోచుకోవాలో అప్పుడే లిస్ట్ తయారు చేసుకున్నారని అన్నారు.
అధికారంలోకి రాగానే ఆ స్థలాల దోపిడీపై జగన్ దృష్టి పెట్టారని, అసైన్డ్ భూములను లాక్కునేందుకు పేదలపై లాఠీఛార్జి చేయించారని, ప్రభుత్వ భూములు వేల ఎకరాలను తన అనుయాయుల పేరుతో దోచేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. పరిశ్రమలు ఏర్పాటు పేరుతో అప్పనంగా అప్పగించేశారని, ఏ ప్రాంతంలో కూడా ఒక్క పరిశ్రమ లేదని, ఉద్యోగం, ఉపాధి లేదని విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా ఈ భూదోపిడీ జరిగిందనేది వాస్తవమని.. ప్రభుత్వ ఆస్తులు కూడా తనఖా పెట్టిన ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు.
ఏపీ సచివాలయం కూడా తాకట్టు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డని, ఇక ప్రైవేటు ఆస్తులు మాత్రమే ఉండటంతో జగనన్న భూ రక్షణ కాదు...భూభక్షణ చేశారని పట్టాభిరామ్ విమర్శించారు. ప్రజల ఆస్తులకు జగన్ బొమ్మలతో సర్వే రాళ్లు వేశారని, అలాగే ఆస్తి పట్టాలపై జగన్ బొమ్మతో పత్రాలు ఇచ్చారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇప్పుడు ప్రైవేటు ఆస్తుల దోపిడీని మొదలు పెట్టారన్నారు. రీ సర్వే పేరుతో ఆస్తులు దోచుకున్న దుర్మార్గపు చరిత్ర జగన్‌దని, సైకో జగన్ రెడ్డి భూదాహానికి సుబ్బారావు కుటుంబం బలి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ జగన్‌కు అధికారం ఇస్తే మీ ఆస్తులు కోల్పోవాల్సి వస్తుందని, ఇటువంటి సైకో జగన్‌ను ప్రజలంతా తరమి కొట్టాలని, ఎన్డీఎ కూటమికి విజయం కట్ట బెట్టాలని పట్టాభిరామ్ పిలుపిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హనుమకొండ జిల్లా, మడికొండలో కాంగ్రెస్ జనజాతర సభ దృశ్యాలు..
జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News and Crime News
Updated Date - Apr 25 , 2024 | 01:16 PM