ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: వినుకొండ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే..

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:55 AM

గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజక టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందని ఆయన అన్నారు. బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

వినుకొండ: మూడున్నర నెలల కిందట అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్‌సీపీ నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. నిన్న (బుధవారం) ఆ పార్టీకి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజక టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందని ఆయన అన్నారు. బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో తల్లి కాంగ్రెస్‌లోకి పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది తెలిసిన కొంత మంది వైసీపీ నేతలు ముందస్తుగా వాళ్ల దారులు వాళ్లు వెతుక్కుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు.


ఏపీలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కితాబు ఇచ్చారు. 100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైందని అన్నారు. ‘‘ఇక మన పార్టీ మనుగడ కష్టమనే నిర్ణయం ఆ పార్టీ నేతల్లో వచ్చింది. చంద్రబాబు-పవన్ జోడీ సూపర్ సక్సెస్. అందుకే రోజుకొకరు పార్టీ వదిలి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వీళ్లందరి కంటే ముందే వాళ్ల నేత జగన్ రెడ్డి బెంగుళూరులో దారులు వెతుక్కుంటున్నారు’’ అని ఎమ్మెల్యే జీవీ జీవీ ఆంజనేయులు అన్నారు.


కాగా బాలినేని కంటే ముందు పలువురు కీలక నేతలు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ జాబితాలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా బాలినేని వంటి సీనియర్ నేత, జగన్‌కు దగ్గర బంధువైన బాలినేని కూడా రాజీనామా చేయడంతో పార్టీ కేడర్‌లో కలవరం మొదలైంది.


మరోవైపు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అధినేత జగన్‌కు సీనియర్ నేతలు ఝలక్ ఇచ్చారు. ఆయనతో భేటీకి మాజీ మంత్రి రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. వీరిద్దరు మాజీల వైఖరీపై వైసీపీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఎందుకు రాలేదో.. అంటూ రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ వైసీపీలో ఉండేందుకు నేతలు సిద్ధంగా ఈ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది.


ఇవి కూడా చదవండి

పవన్‌తో నేడు బాలినేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

హోంమంత్రి అనిత వద్దకు నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

Updated Date - Sep 19 , 2024 | 12:06 PM

Advertising
Advertising