ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా.. వైసీపీ వింత ప్రవర్తన

ABN, Publish Date - Nov 15 , 2024 | 09:20 AM

ప్రజల్లో బలం కోల్పోవడంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారానికి తెరలేపారనే ఒక చర్చ జరుగుతోంది. నాలుగు నెలల పాటు కూటమి ప్రభుత్వం జస్ట్ వార్నింగ్‌లతో సరిపెట్టి సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఫేక్ ప్రచారాలు తగ్గకపోవడంతో చర్యలు ..

YSRCP

సామాజిక మాద్యమాల్లో తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు.. ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నవారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో వైసీపీలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా చర్యలు తీసుకోకూదన్నట్లు వైసీపీ వ్యవహారశైలి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేక్ పోస్టులు పెట్టినా తమపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చూస్తుంటే జగన్ పార్టీ ఆలోచన తీరు ఎలా ఉందో అర్థమవుతోందట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి, పార్టీని ప్రశ్నించే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు గతంలో వినిపించాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఉండొచ్చు. ప్రజల్లో బలం కోల్పోవడంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారానికి తెరలేపారనే ఒక చర్చ జరుగుతోంది. నాలుగు నెలల పాటు కూటమి ప్రభుత్వం జస్ట్ వార్నింగ్‌లతో సరిపెట్టి సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఫేక్ ప్రచారాలు తగ్గకపోవడంతో చర్యలు ప్రారంభించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపడంతో.. తమకున్న ఒక అస్త్రాన్ని కోల్పోతామనే భయంతో వైసీపీ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది.


నాడు తప్పు.. నేడు ఒప్పా..

ప్రభుత్వంలో ఎవరు ఉన్నప్పటికీ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవారిపై చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కానీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేసులు బనాయించారు. ప్రస్తుతం తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ వైసీపీ అధ్యక్షులు జగన్ డిమాండ్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. సామాజిక మాద్యమాల్లో ఫేక్ పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఐదేళ్లపాటు హెచ్చరించిన వైసీపీ.. ప్రస్తుతం అదే ఫేక్ పోస్టులతో రాజకీయం చేస్తోందనే చర్చ జరుగుతోంది.


కోర్టులో..

ఫేక్ పోస్టులు పెట్టినా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును ఆశ్రయించడంపై న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు. తప్పుడు పోస్టులపై చర్యలు వద్దని తాము ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వారి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టిన వ్యక్తులు ఇవాళ కోర్టు మెట్లు ఎక్కి తాము చేసే సోషల్ మీడియా పోస్టులపై చర్యలు వద్దని కోరడం ఎంతవరకు సబబు. ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకుంటుందా లేదా ఇదే తరహాలో వ్యవహారిస్తుందా అనేది వేచి చూడాలి.

వైసీపీ తీరుపై

సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులను వైసీపీ సమర్థించుకోవడం హేయమైన చర్యగా బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో కోర్టులు, న్యాయమూర్తుల పట్ల చులకనభావంతో వ్యవహారించిన వైసీపీ నాయకులు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించడం విచిత్రంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను గౌరవించని వ్యక్తులకు ప్రస్తుతం వ్యవస్థలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. వైసీపీ ఫేక్ ప్రచారాలపై ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం సరైన నిర్ణయమని వీరన్నచౌదరి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 18 , 2024 | 09:08 PM