ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: నిన్న బైక్.. నేడు ఆటో.. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అంతే లేదా?

ABN, Publish Date - Feb 03 , 2024 | 10:15 AM

Andhrapradesh: జిల్లాలో అధికారపార్టీ అరాచకాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా వైసీపీ దారుణాలకు పాల్పడుతోంది. నిన్న ఓ టీడీపీ నేత బైక్‌ను తగులబెట్టిన వైసీపీ శ్రేణులు ఈరోజు (శనివారం) మరో ఘాతుకానికి పాల్పడ్డారు.

పల్నాడు, ఫిబ్రవరి 3: జిల్లాలో అధికారపార్టీ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా వైసీపీ దారుణాలకు పాల్పడుతోంది. నిన్న ఓ టీడీపీ నేత బైక్‌ను తగులబెట్టిన వైసీపీ శ్రేణులు ఈరోజు (శనివారం) మరో ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఓ వ్యక్తి ఆటోను వైసీపీ శ్రేణులు తగులబెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన షేక్ రఫీ ఆటోను తగులబెట్టేశారు. ఆటో డ్రైవర్ రఫీ టీడీపీ సానుభూతిపరుడుగా ఉన్నాడు.

కాగా.. నిన్న (శుక్రవారం) మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని వైసీపీ నేతలు తగులబెట్టారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాదం రాంబాబుకు చెందిన ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. అయితే ఉదయం లేచి చూడగా ద్విచక్ర వాహనం తగులబడి కనిపించింది. గురువారం టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఓర్వలేక వైసీపీ నాయకులు ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న ధ్వంసంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 03 , 2024 | 10:17 AM

Advertising
Advertising