YSRCP: జగన్‍కు నటనలో ది బెస్ట్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్..
ABN, Publish Date - Nov 08 , 2024 | 01:02 PM
నటనలోనూ జగన్ జీవించేశారని, సినిమాలో నటిస్తే నిజంగా నటుడి పాత్రకు న్యాయం చేయగలరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే జగన్‍కు రాజకీయాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని కోరుతున్నారట. 2019 నుంచి 2024 వరకు తన అరాచక పాలనతో రాష్ట్రాన్ని..
ఆంధ్రప్రదేశ్‍లో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలంటూ ఓ వైపు నెటిజన్లు, మరోవైపు సామాన్య ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు. గురువారం జగన్ మీడియా సమావేవశంలో చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ డిమాండ్ ఎక్కువుగా వినిపిస్తోందట. నటనలోనూ జగన్ జీవించేశారని, సినిమాలో నటిస్తే నిజంగా నటుడి పాత్రకు న్యాయం చేయగలరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే జగన్‍కు రాజకీయాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని కోరుతున్నారట. 2019 నుంచి 2024 వరకు తన అరాచక పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన జగన్.. విపక్షంలో ఉంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయట. తాము ఎలాంటి అభివృద్ధి చేయకపోడంతో.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసత్య ప్రచారాలు చేయడంలో జగన్ అద్భుతంగా నటిస్తున్నారని, అబద్ధా్ని నిజంగా నమ్మించడం కోసం ఆయన ఎంతో శ్రమ పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రత్యర్థి పార్టీలపై కక్ష తీర్చుకునేందుకు ఉపయోగించుకున్న జగన్ ప్రస్తుతం నీతి వాఖ్యాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందట.
Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
అధికారంలో ఉన్నంత కాలం తప్పులు చేస్తూ వచ్చిన పార్టీ నాయకులను, కార్యకర్తలను సమర్థిస్తూ వచ్చిన జగన్.. ఇప్పుడేమో తమ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామంటున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారికి అండగా ఉంటామనే సందేశం ఇచ్చేలా జగన్ మీడియా సమావేవంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన సొంత పార్టీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ప్రస్తుత ప్రభుత్వం కూడా తప్పులు చేసే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోకూడదని జగన్ కోరుకుంటున్నారా అనే అనుమానం కలగక మానదు. ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా.. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై, నేరాలకు పాల్పడేవారిపై పార్టీలకతీతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన జగన్.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఫేక్ పోస్టులు పెట్టేవారికి తమ పార్టీ అండగా ఉంటుందని, తప్పులు చేసేవారిపై కేసులు పెడితే ప్రయివేటు కేసులు వేస్తామంటూ హెచ్చరించడం చూస్తే.. జగన్ పార్టీ అసలు వైఖరేంటో స్పష్టమవుతుందని కూటమి పార్టీ నాయకులు చెబుతున్నారు.
AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు
నటనపై ప్రశంసలు..
అసత్యాలు చెప్పడంలోనూ, అవాస్తవాలను వాస్తవాలుగా నమ్మించడంలో జగన్ బాగా నటిస్తున్నారంటూ నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదని అప్పటి విపక్షాలు హెచ్చరించినా పట్టించుకోని జగన్ ప్రస్తుతం తప్పులు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చంద్రబాబు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే మీడియా ముందుకు వచ్చి.. తప్పుడు పనులు చేసే వారిని సమర్థించేందుకు జగన్ చేసిన ప్రయత్నంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం ప్రకటనను విపక్ష నేతగా స్వాగతించాల్సిన జగన్.. ప్రభుత్వ నిర్ణయంతో ఎందుకు కంగారు పడుతున్నారో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 08 , 2024 | 03:13 PM