ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ప్రజలను మాయ చేయడంలో మేమే ఫస్ట్ అంటున్న వైసీపీ.. జగన్ ట్రైనింగ్ అదుర్స్..

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:15 PM

వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు..

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకుల తీరు ఈ మధ్య కాలంలో కొంచెం విచిత్రంగా ఉందనే చర్చ జరగుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనను చూసిన జనం, ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కకుండా తీర్పునిచ్చారు. తమ పాలన ఎంతో అద్భుతమని వైసీపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ ప్రజా తీర్పు చూస్తే వైసీపీపై ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు.. వైసీపీ తప్పులను ప్రజలు ఎంత క్షుణ్ణంగా పరిశీలించారనే విషయం స్పష్టమవుతోంది. అధికారం పోయినప్పటికీ వైసీపీ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదనే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం రవాణా చేయడంతో పాటు, రాష్ట్రంలో అనేక అక్రమ దందాలను ఇంకా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నవారిలో వైసీపీ నేతలు ఉన్నారని కూటమి నేతలు చెబుతుండగా.. తమపై మచ్చ పడకుండా ఉండేందుకు వైసీపీ తెగ ప్రయత్నం చేస్తోందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ హయాంలో రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసినా, ఆ విషయం బయటకు పొక్కకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందనే చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు, ఆ తప్పును కూటమి ప్రభుత్వంపై వేసేందుకు వైసీపీ తెగ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది.


ఆ విషయంలో ఫస్ట్ అంటున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రజల మధ్య ఎక్కువుగా కనిపించడంలేదట. వారంలో సంగం రోజులు బెంగళూరులో, మరో సగం రోజులు తాడేపల్లిలో ఉంటూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాడేపల్లికి వచ్చినప్పుడు కొందరు పార్టీ నేతలను మాత్రం కలుస్తున్నారట. పార్టీ నాయకులతో సమావేశమైనప్పుడు ప్రజల దృష్టిని ఎలా మరల్చాలి, ప్రజలను ఎలా మాయ చేయాలనే విషయంలో ట్రైనింగ్ ఇస్తున్నారేమో అనే విధంగా చర్చ జరుగుతోంది. ప్రజలు తమపై విశ్వాసం కోల్పోవడంతో, తిరిగి విశ్వాసం పొందడానికి చాలా సమయం పడుతుందని, ఈలోపు కూటమి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసాన్ని పెంచుకోకుండా, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేవిధంగా వైసీపీ అధ్యక్షులు జగన్ తన పార్టీ నాయకులకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


కొత్త నాటకమా..!

కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, దీని వెనుక ఓ ముఠా హస్తం ఉందని, ఆ ముఠాలో వైసీపీ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు రావడంతో, తమ పార్టీ నేతలకు సంబంధం లేదని నేరుగా చెప్పకుండా పొంతనలేని అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ ఎంతో శ్రమిస్తుందట. ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకుని ప్రజల విశ్వాసం పొందేందుకు ప్రయత్నిస్తుందా.. లేదంటే ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందా అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 03 , 2024 | 05:15 PM