ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సీఎం చంద్రబాబును కలిసి సహాయ నిధికి విరాళాలు అందించిన ప్రముఖులు

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:37 PM

ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో మరణించారు. వందలాది ఇళ్లు నీటి ముంపులో ఉండిపోయాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో సహాయక చర్యలను చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక చేపట్టింది.

హైదరాబాద్/అమరావతి, సెప్టెంబర్ 15: ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో మరణించారు. వందలాది ఇళ్లు నీటి ముంపులో ఉండిపోయాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో సహాయక చర్యలను చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక చేపట్టింది.

అలాంటి వేళ.. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ముందుకు వచ్చారు... వస్తున్నారు. ఆ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పలువురు ప్రముఖులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు చెక్కుల రూపంలో అందించారు. వారి వివరాలు..

Also Read: Haryana Assebly Elections: ఆప్ చేతిలో దెబ్బ తప్పదా..?


1)

జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు.

2)

కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ. కోటి 11 లక్షలు.

3)

చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత రూ. కోటి.

4)

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం రూ. కోటి 50 లక్షలు.

5)

ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి రూ. కోటి

6)

లారస్ ల్యాబ్స్ ఫౌండర్ & సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ రూ. కోటి.

7)

చలసాని చాముండేశ్వరి, శ్రీరామ్ రూ. 25 లక్షలు

8)

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.2 లక్షలు

9)

నరసింహారావు రూ.2 లక్షలు అందించారు

Also Read: Delhi CM: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?


భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి చౌహాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరద నష్టంపై కేంద్ర మంత్రికి ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు.

Also Read: Jharkhand: విపక్షాలపై ప్రధాని మోదీ విసుర్లు


ఇక భారీ వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం సైతం వెంటనే స్పందించింది. తెలుగు రాష్ట్రాలకు వరద సాయం కింద రూ. 3,300 కోట్ల తక్షణ సాయంగా ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీన తెలుగు రాష్ట్రాల వరద నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు.

Also Read: Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు


మరోవైపు ఈ వరద విపత్తుపై తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఉద్యోగ సంఘాలతోపాటు ఎన్జీవో సంఘాలు సైతం స్పందించి భారీగా విరాళాలు అందించాయి. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సైతం భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం విధితమే.

Also Read: J&K Assembly polls: ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్ విడుదల

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 07:41 PM

Advertising
Advertising