Bank Manager: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:14 PM
సొసైటీకి చెందిన నగదుకు బ్యాంకు మేనేజర్.. తన వ్యక్తిగతానికి వాడుకొన్నారు. దీంతో బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది.
నరసరావుపేట, డిసెంబర్ 23: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట సమీపంలోని ఈపూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యుడు ముప్పాళ్ల కోటేశ్వరరావు..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సొసైటీ పేరుతో ఖాతా తెరవాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంక్ మేనేజర్ శొంటి సాయిరాంను ఆయన సంప్రదించారు. నగదుతోపాటు.. అందుకు కావాల్సిన పత్రాలు ఇస్తే.. వెంటనే ఖాతా తెరుస్తామని ముప్పాళ్ల కోటేశ్వరరావుకు బ్యాంక్ మేనేజర్ సూచించారు. దీంతో అందుకు సంబంధించిన డాక్యుమెంట్లలోపాటు రూ.5 లక్షల చెక్కును బ్యాంక్ మేనేజర్‌కు అందజేశారు.
అయితే నగదు మాత్రం.. సొసైటీ ఖాతాలో జమా కాలేదు. నెలలు గడుస్తున్నా నగదు మాత్రం ఖాతాలో జమా కాక పోవడంపై ముప్పాళ్ల కోటేశ్వరరావుతోపాటు ఇతర సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌ను వారు పలుమార్లు కలిసి విజ్జప్తి చేశారు. అయితే సొసైటి వారికి తెలియకుండా.. రూ. ఐదు లక్షల నగదు బ్యాంక్ మేనేజర్ శొంటి సాయిరాం డ్రా చేసినట్లు గుర్తించారు. దీంతో మేనేజర్‌ను కలిసి నిలదీసే ప్రయత్నం చేశారు.
దాంతో అతడు సొసైటీ సభ్యులతో బేర సారాలకు దిగాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును సొసైటీ సభ్యులు ఆశ్రయించారు. హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ శొంఠి సాయిరాం చేసిన ఘరానా మోసాన్ని ఈ సందర్బంగా ఎస్పీకి వారు సోదాహరణగా వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 23 , 2024 | 04:30 PM