ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Department : స్థానికుల్ని తొక్కేద్దాం.. బయట వాళ్లకు ఇచ్చేద్దాం..!

ABN, Publish Date - Dec 25 , 2024 | 06:00 AM

ప్రభుత్వ శాఖ లు ఏవైనా టెండర్లు పిలిస్తే ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా నిబంధనలు సిద్ధం చేస్తారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీతో పాటు ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్యశాఖ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

  • శానిటేషన్‌ టెండర్‌ నిబంధనలపై వ్యతిరేకత

  • ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు

  • ఈఎండీ తగ్గించాలని లోకల్‌ కంపెనీలు డిమాండ్‌

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖ లు ఏవైనా టెండర్లు పిలిస్తే ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా నిబంధనలు సిద్ధం చేస్తారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీతో పాటు ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్యశాఖ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్థానిక కాంట్రాక్టర్లను తొక్కేసి.. పక్క రాష్ట్రాల్లోని బడా కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసేలా ఉన్నతాధికారులు శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ టెండర్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. దీనివల్ల స్థానిక కంపెనీలతో పాటు చిన్న కంపెనీలకు టెండర్లల్లో పాల్గొనే అర్హత లభించట్లేదు. ఆరోగ్యశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఏదైనా కంపెనీ టెండర్లలో పాల్గొనాలంటే రూ.2 కోట్ల వరకూ ఈఎండీ కట్టాల్సి ఉంటుంది. టెండర్‌ వచ్చిన తర్వాత మూడేళ్లకు బ్యాంక్‌ గ్యారెంటీని ప్రభుత్వానికి అందించాలి. ఇలా కోట్లల్లో ఈఎండీ, బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాలంటే రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ టెండర్ల కోసం ఈ స్థాయిలో నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర కంపెనీల ప్రతినిధులు ప్రీ బిడ్‌ మీటింగ్‌లో ప్రశ్నించారు. ఈఎండీ తగ్గించాలని, బ్యాంక్‌ గ్యారెంటీ ఏడాదికి ఇచ్చేలా నిబంధనలు మార్చాలని కోరారు. రూల్స్‌ మార్చే ప్రసక్తే లేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఏపీఎంఎ్‌సఐడీసీ సీఈ శ్రీనివాస్‌ తేల్చి చెప్పారు. దీంతో ప్రీ బిడ్‌ సమావేశానికి హాజరైన 15 కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి.


పర్సంటేజీలోనే తేడా...

టెండర్లలో ఈసారి సరికొత్త నిబంధన పెట్టారు. శానిటేషన్‌, సెక్యూరిటీ ఉద్యోగులకు, సూపర్‌వైజర్లకు టెండర్‌ డాక్యుమెంట్‌లో జీతాలు నిర్ణయించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు చేసేందుకు అవసరమైన పరికరాలు, కెమికల్స్‌కు కూడా ముందుగానే రేట్లు నిర్ణయించారు. కంపెనీలు కేవలం ఎంత పర్సంటేజ్‌కు శానిటేషన్‌, సెక్యూరిటీ పనులు చేస్తారన్న దాన్ని మాత్రమే బిడ్‌లో దాఖలు చేస్తే సరిపోతుంది. అది కూడా 3.85 నుంచి 5 శాతం లోపు ఉండాలని నిబంధనన పెట్టారు. శానిటేషన్‌, సెక్యూరిటీ టెండర్లకు పోటీ ఎక్కువ ఉం టుంది. కాబట్టి ప్రతి కంపెనీ 3.85 శాతానికే చేస్తామని బిడ్‌ దాఖలు చేస్తే ఏం చేస్తారని కంపెనీల ప్రతినిధులు ప్రీ బిడ్‌ మీటింగ్‌లో ప్రశ్న లెవనెత్తారు. అన్ని కంపెనీలు 3.85 శాతానికే చేస్తామని ముందుకొస్తే ఏ కంపెనీ టర్నోవర్‌ ఎక్కువ ఉంటుందో దానికే టెండర్‌ ఇస్తామని అధికారులు చెప్పారు. ఇదేం నిబంధన అని ప్రశ్నిస్తే.. సమాధానం లేదు.


జోన్‌ల వారీ టెండర్లు ఫెయిల్‌!

శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌కు జోన్‌ల వారీగా టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. కొత్త విధానంలో ముం బై, చెన్నై, ఢిల్లీలో ఉండే పెద్ద కంపెనీలు టెండర్లు దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో ఆయా సంస్థలతో ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో ఆరోగ్యశాఖ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఏ-1 అనే సంస్థ రాయలసీమ జోన్‌ శానిటేషన్‌ పనులు చేస్తుంది. సదరు సంస్థ వల్ల సమస్యలు వస్తున్నాయి. పదేళ్లలో ఇప్పటి వరకూ సంస్థ హెడ్‌ స్థానికంగా అందుబాటులో ఉండట్లేదు. ప్రతి జోన్‌ కాంట్రాక్టర్‌తో ఇవే సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఆస్పత్రుల వారీగా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం దక్కేలా రాష్ట్రంలో నిబంధనలు మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

గతంలో లేని విధంగా నిబంధనలు

శానిటేషన్‌, సెక్యూరిటీ పాలసీని 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వమే తీసుకువచ్చింది. అప్పుడు ఈఎండీ రూ.10-50 లక్షల లోపే ఉండేది. వైసీపీ ప్రభుత్వం కూడా రూ.20 లక్షల లోపే ఈఎండీల నిబంధన పెట్టింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా టెండర్‌ నిబంధనల్లో మార్పులు చేసి.. ఈఎండీలు ఎందుకు పెంచారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ముందుగానే కొన్ని కంపెనీలను నిర్ణయించుకుని, వాళ్లకే టెండర్‌ దక్కేలా రూల్స్‌ పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారంగా ఏ టెండర్లో అయినా బ్యాంక్‌ గ్యారెంటీ ఏడాదికి మాత్రమే తీసుకుంటారు. తర్వాత ప్రతి ఏటా రెన్యువల్‌ చేసుకుంటారు. 108, 104 వాహనాలు నిర్వహించే పెద్ద కంపెనీలు కూడా బ్యాంక్‌ గ్యారెంటీలు ఏడాదికి మాత్రమే ఇస్తాయి.

Updated Date - Dec 25 , 2024 | 06:00 AM