ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

APSRTC: సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులు.. జనానికి నరకం

ABN, Publish Date - Mar 11 , 2024 | 08:22 AM

డబ్బులు, మద్యం, బిర్యానీ పంచారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు, స్కూల్‌ బస్సులు కూడా తరలించారు. వైసీపీ నాయకులకు జనసమీకరణ టార్గెట్లు పెట్టారు. ఆర్థిక, అంగ బలాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడ్డారు. ఇంత చేసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో వైసీపీ నిర్వహించిన దక్షిణ కోస్తాంధ్ర ‘సిద్ధం’ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోయారు.

మేదరమెట్ల సభకు భారీగా ఆర్టీసీ బస్సులు

ప్రకాశం జిల్లాలో ప్రయాణికులకు అవస్థలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) :

డబ్బులు, మద్యం, బిర్యానీ పంచారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ (APSRTC) బస్సులతో పాటు ప్రైవేటు, స్కూల్‌ బస్సులు కూడా తరలించారు. వైసీపీ నాయకులకు జనసమీకరణ టార్గెట్లు పెట్టారు. ఆర్థిక, అంగ బలాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడ్డారు. ఇంత చేసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో వైసీపీ నిర్వహించిన దక్షిణ కోస్తాంధ్ర ‘సిద్ధం’ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ సభ పేరిట జనానికి నరకం చూపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. హైవేలో ట్రాఫిక్‌ మళ్లించడంతో వాహనదారులు సతమతమయ్యారు. వందల ఎకరాల్లో సభ అంటూ ఊదరగొట్టినా అంతా కలిపి 50 ఎకరాల్లోపే సభా ప్రాంగణాన్ని పరిమితం చేశారు. హాజరైన జనం కూడా రెండు లక్షల్లోపే ఉంటారని అంచనా. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలకు శ్రీకారం చుట్టిన వైసీపీ నాలుగో సభను భారీస్థాయిలో నిర్వహించాలని భావించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని నేతలందరినీ అప్రమత్తం చేసి వారికి ఆర్టీసీ బస్సులను భారీగా సమకూర్చింది. ఎక్కడికక్కడ స్థానికంగా విద్యా సంస్థల బస్సులను కూడా వినియోగించుకున్నారు. డబ్బు, మందు భారీగా పంపిణీ చేసినా సిద్ధం సభకు వచ్చేందుకు జనం ఆసక్తి చూపలేదు. సిద్ధం సభా ప్రాంగణంలో పలుచోట్ల మద్యం మత్తులో ఉన్న ప్రజలు రోడ్డమీద పడి ఉండి కనిపించింది.

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

ప్రయాణికులకు చుక్కలు..

జగన్‌ (CM Jagan) సిద్ధం సభ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రయాణికులకు చుక్కలు చూపించింది. జిల్లాలో 471 ఆర్టీసీ బస్సులు ఉండగా 320 బస్సులను ఆదివారం జరిగిన సిద్ధం సభకు పంపారు. దీంతో చాలా ప్రాంతాల్లో బస్సులు లేక ఆర్టీసీ డిపో (RTC Depo)లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మండుటెండలో పడిగాపులు కాశారు. అలాగే వందలాది ప్రైవేటు స్కూలు బస్సులను అఽధికారులతో ఒత్తిడి చేయించి సిద్ధం సభకు తరలించారు. మరోవైపు ఒంగోలుకు 30 కి.మీ దూరంలో జాతీయ రహదారి దగ్గర సిద్ధం సభ నిర్వహించడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. చెన్నై–కోల్‌కతా ప్రధాన రహదారిలో ఒంగోలు నుంచే ఆ మార్గంలో వెళ్లకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు.

YS Sharmila: ‘సిద్ధం’ ప్రచారానికి 600 కోట్లు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 08:22 AM

Advertising
Advertising