ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pithapuram : ‘జగన్‌ నామస్మరణ’పై ఉన్నతాధికారుల సీరియస్‌

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:17 AM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్‌ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

రేపర్లు తొలగించి చిక్కీలు ఇవ్వాలని ఆదేశం

పిఠాపురం, జూన్‌ 29: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్‌ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. దీన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.

కాకినాడ జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు అందించే చిక్కీ ప్యాకెట్లపై జగన్‌ ఫొటో బదులుగా రాజముద్ర ముద్రించగా, వెనుకభాగంలో మాత్రం వెబ్‌సైట్‌ చిరునామా ‘జగనన్న గోరుముద్ద’గా ఉండడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చిక్కీ ప్యాకెట్లపై ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.

దీంతో విద్యాశాఖాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. చిక్కీ ప్యాకెట్లపై జగనన్న గోరుముద్ద అని ఉన్న రేపర్లను తొలగించి చిక్కీలను విద్యార్థులకు అందజేయాలని ఎంఈవోలను జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించారు. వచ్చే నెల నుంచి ‘పీఎం పోషణ్‌’ పేరుతో చిక్కీలు వస్తాయని వారు తెలిపారు.

Updated Date - Jun 30 , 2024 | 06:54 AM

Advertising
Advertising