ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayasai Reddy: నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీస్తే ఆఖరికి మా పార్టీ వారిని కూడా వదలను..

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:52 AM

ఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నామని తెలిపారు.

విశాఖ: ఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నామని తెలిపారు. 175 స్థానాలకు గానూ..11 స్థానాలు తమ పార్టీకి వచ్చాయని.. ప్రజల తీర్పు ను గౌరవిస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిందని.. హామీలు అమలు చేయలేక పోతున్నారన్నారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బ తీసిన వారెవరైనా..ఆఖరికి మా పార్టీలో ఉన్న వారైనా వదేలే ప్రసక్తి లేదన్నారు.

Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..


విజయవాడలో తన ఇంటికి... వచ్చి తాను ఎక్కడ ఉన్నానో విచారణ చేశారని తెలిపారు. ఆ వ్యక్తి ఎక్కడకు రమ్మంటే.. తాను అక్కడకు వస్తానన్నారు. తనకు భయం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. మధ్యతంతర ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు. అప్పుడు అందరి తోకలు కట్ చేస్తాం. ఆధారాలు లేని ఆదివాసీ మహిళలకు అన్యాయం చేస్తున్నారు. అవాస్తవాలు ప్రసారం చేసిన మీడియాతో ఎలా క్షమాణాలు చెప్పించాలో నాకు తెలుసు. బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి కాదు... తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తారు. ఈ కుట్ర, కుతంత్రాల వెనుక ఎవరు ఉన్నారో.. తేలుస్తా. ప్రతి పక్షంలో ఉన్నా ఎవరిని వదలను.. బుద్ధి చెబుతా. యూట్యూబ్ చానల్స్‌పై కూడా చర్యలు ఉంటాయి’’ అని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి...

MLA Maddipati Venkata Raju: పంట పొలాలను పరిశీలించిన వెంకట రాజు

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 11:53 AM

Advertising
Advertising
<