ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Saraswati...: సరస్వతీ నమోస్తుతే...

ABN, Publish Date - Oct 09 , 2024 | 11:33 PM

దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు నగరానికి కొత్త ఆధ్యాత్మికశోభను తీసుకొ చ్చాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం అమ్మవారు వివిధ ఆలయాల్లో సరస్వతీదేవి అలంకా రంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా విజ యదుర్గా దేవి ఆలయంలో అమ్మవారు కాళరాత్రిదేవి అలంకా రంలో దర్శనమిచ్చారు.

కడప నగరంలో సరస్వతీ అమ్మవారి అలంకారంలో లలితా పంచాయతన అమ్మవారు

కడప విజయదుర్గాదేవి ఆలయంలో కాళరాత్రిదేవి అలంకారం

అమ్మవారి దర్శనం పరమపావనం

కడప (కల్చరల్‌) అక్టోబరు 9: దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు నగరానికి కొత్త ఆధ్యాత్మికశోభను తీసుకొ చ్చాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం అమ్మవారు వివిధ ఆలయాల్లో సరస్వతీదేవి అలంకా రంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా విజ యదుర్గా దేవి ఆలయంలో అమ్మవారు కాళరాత్రిదేవి అలంకా రంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం పరమపా వనంగా కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు ఆల యాల బాట పట్టారు. ప్రతి ఆలయం ఎదుట విద్యుత్‌ దీప కాంతులతో అమ్మవారి ప్రతిరూపాలు దేదీప్యమా నంగా ప్రకాశిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

కాళరాత్రిదేవి అలంకారంలో విజయదుర్గాదేవి

నగర బిల్టప్‌ సమీప విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు కాళరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గామాత కాళరాత్రి అవతారం. మూలా నక్షత్రం కావున అమ్మవారికి తెల్లవారు జామున 63 కళశాలతో విశేష అభిషేకం నిర్వహించా రు. అర్చకులు యాగశాలలో చండీహో మం, శ్రీచక్ర మండపంలో శ్రీ చక్రార్చనలు చేశారు. సాయంత్రం 4-30కు విశేష పూజలో భాగంగా చదు వుల తల్లి సరస్వతి దేవి పూజ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తు లకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు విజయ దుర్గా-మల్లికార్జునులు ఆలయ ప్రదక్షిణ నిర్వహించా రు. ప్రదక్షిణ ముందు చిన్నారుల కోలాటం భక్తులను ఆకర్షించిందని ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికా ర్జున రావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ తెలిపారు.


సరస్వతీ అమ్మవారి అలంకారంలో వాసవీ కాన్యకాపరమేశ్వరి దేవి

కడప నగరంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆల యం, రాజరాజేశ్వరీదేవి ఆలయం(ఆకులవీధి), జగ న్మాత బాలపోలేరమ్మ ఆలయం(చిన్నబెస్తవీధి), భద్రా వతి భావనారుషి ఆలయం, నడివీధి గంగమ్మ తల్లి ఆలయం (హనుమప్పవీధి), సోమసుందరేశ్వరస్వా మి ఆలయం (గడ్డిబజార్‌), అంబాభవానీ ఆలయం (భవానీనగర్‌), రామలింగ చౌడేశ్వరీదేవి ఆలయం (నబీకోట), రాజరాజేశ్వరీదేవి ఆలయం (హరిహరరా వువీధి), చౌడేశ్వరీదేవి (ఎర్రముక్కపల్లె) ఆలయాల్లో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు.

చింతకొమ్మదిన్నెలో....

సికెదిన్నె, అక్టోబరు 9: కొత ్తపేట గంగమ్మ తల్లి భక్తులకు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. బయనపల్లి ఉమామహేశ్వరి, ప్రొఫెసర్స్‌ కాలనీలో చౌడేశ్వరీదేవి ఆలయాల్లో సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సింహాద్రిపురంలో...

సింహాద్రిపురరం, అక్టోబరు 9: పాతూరు చౌడేశ్వరి దేవి ఆలయంలో సరస్వతీ దేవి అలంకరణలో భక్తు లకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో వున్న సరస్వతీ దేవి అమ్మ వారిని అధిక సంఖ్యలో భక్తులు కన్నులారా దర్శించుకున్నారు.

పులివెందులలో...

పులివెందుల రూరల్‌, అక్టోబరు 9: అంకాళమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకున్నారు.

వేంపల్లెలో...

వేంపల్లె, అక్టోబరు 9: కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చా రు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిం చారు. సాయంత్రం అమ్మవారిని సరస్వతీదేవి అలం కరణలో కొలువదీర్చారు. భక్తులు తీర్థప్రసాదాలు అందుకున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 11:33 PM