ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల

ABN, Publish Date - Oct 13 , 2024 | 08:45 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అమరావతి, అక్టోబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పరిస్థితి సమీక్షించిన హోం మంత్రి..

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా భారీ వర్షాల కారణంగా ఎటువంటి ముప్పు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.


అలాగే పోలీస్ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో సైతం భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి వాటిని సరి చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలని హోం మంత్రి అనిత ఈ సందర్భంగా ఆదేశించారు. పిడుగులు పడే అవకాశముందని.. అలాగే వాగులు పొంగే అవకాశం సైతం ఉందందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయదారులు, పశువుల కాపర్లు, రైతులు బయటకు వెళ్లకుండా ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


ఇక మత్స్యకారులు సైతం చేపల వేటకు వెళ్లకుండా ఉండాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.


విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కీలక సూచనలు..

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వెళ్లరాదని ఆదేశించారు.


అలాగే ఈ వర్షాల నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సహాయక చర్యల నేపథ్యంలో విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. అత్యవసర సమయంలో 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.


భారీ వర్షాలు కురిసే సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువులు కాపరులు చెట్లు కింద పోల్స్, టవర్స్ కింద ఉండవద్దని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 13 , 2024 | 09:25 AM