ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేకాట సొమ్ము నొక్కేసిన సీఐ, ఎస్‌ఐపై వేటు

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:53 AM

పేకాట సొమ్ము నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్‌ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది.

రాజమహేంద్రవరం, తిరుపతి (నేరవిభాగం), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పేకాట సొమ్ము నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్‌ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలోపి ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గత నెల 8న పేకాట ఆడుతున్నారనే సమాచారం అందడంతో పెరవలి ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఏడుగురిపై మాత్రమే కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

జూదరుల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు రూ.8లక్షలను పోలీసు బృందం నిడదవోలు సీఐ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మంతనాల తర్వాత రూ.55,500 మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు నమోదు చేశారు. నొక్కేసిన సొమ్మును వాటాలు వేసుకోవడంలో తేడాలు రావడంతో విషయం ఎస్పీ నరసింహ కిషోర్‌ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఈ నెల 2న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో దర్యాప్తు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. జూదరుల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును భారీగా జేబుల్లో వేసుకున్నారని ప్రాథమికంగా రుజువు కావడంతో నిడదవోలు సీఐ వి.శ్రీనివాసరావును ఐజీ అశోక్‌కుమార్‌ ఆదేశాలతో సస్పెండ్‌ చేశారు.


  • పాకాల ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

రోడ్డు ప్రమాదంపై కేసు నమోదులో అలసత్వంతోపాటు నిందితుడి పేరు తారుమారు చేసిన పాకాల ఎస్‌ఐ మహే్‌ష్‌బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ కం రైటర్‌ మొగిలీశ్వర రెడ్డిలపై వేటు పడింది. బాలశివరాం అనే వ్యక్తి ఈ నెల 6న ద్విచక్ర వాహనంపై చిత్తూరుజిల్లా కల్లూరుకు వెళుతుండగా పాకాల వద్ద కారు ఢీకొంది. పాకాల పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసి అతణ్ణి తిరుపతి ఆస్పత్రిలో చేరారు. అయితే, కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం చేస్తున్నారని, నిందితుని పేరూ తప్పుగా నమోదుచేశారని బాధితుడు ఎస్పీని కలసి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.

Updated Date - Oct 20 , 2024 | 04:53 AM