Indian Railways : పట్టాలపై నిప్పుల బండి
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:25 AM
రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ వెల్డింగ్...
ABN Desk : రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ వెల్డింగ్, చిప్పింగ్, గ్రైండింగ్ పనులు చేసే ‘ఫ్లాష్ బట్ వెల్డింగ్ మెషీన్’. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో పనులు చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కింది. ఈ యంత్రంతో ట్రాక్‌ను సరిచేయడం వల్ల రైలు ప్రయాణం కుదుపులు లేకుండా సాగుతుంది. అలాగే శబ్ధం స్థాయి కూడా తగ్గుతుంది. రైల్వే లైన్ల భద్రతపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించే భారతీయ రైల్వే ట్రాక్‌ల నిర్వహణకు ఇలాంటి పలు ఆటోమేటిక్ యంత్రాలను వాడుతోంది.
- అమరావతి, ఆంధ్రజ్యోతి
Updated Date - Dec 14 , 2024 | 04:26 AM