IndiGo Services : రాజమహేంద్రవరం నుంచి ముంబయికి విమాన సేవలు
ABN, Publish Date - Dec 02 , 2024 | 04:40 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోరుకొండ మండలం మఽధురపూడి ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఎయిర్ బస్ సర్వీసును ఆయన ఆదివారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసును ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 04:41 AM