AP Govt: కారుచౌకగా శారదా పీఠానికి ప్రభుత్వ భూమి
ABN, Publish Date - Feb 21 , 2024 | 09:23 PM
విశాఖపట్టణం సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది. భీమిలి మండలం కొత్త వలసలో కూడా భూమికి మంచి ధర ఉంది. ఆ ప్రాంతంలో 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పనంగా కట్టబెట్టారు.
విశాఖపట్టణం: శారదా పీఠం అంటే సీఎం జగన్‌కు (Jagan) ప్రత్యేక అభిమానం. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అంటే అమితమైన గౌరవం. పీఠాధిపతి అడిగితే చాలు ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి సిద్దం. మరోసారి రుజువు అయ్యింది. రూ. కోట్ల విలువ గల భూమిని కారు చౌకగా కట్టబెట్టారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. జగన్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఏకీపారేశాయి.
AP Govt: శారదా పీఠం సేవలో జగన్ సర్కార్.. 2 రోజుల్లో రూ.96 లక్షలతో తారు రోడ్డు
భూముల ధరలకు రెక్కలు
విశాఖపట్టణం సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది. భీమిలి మండలం కొత్త వలసలో కూడా భూమికి మంచి ధర ఉంది. ఆ ప్రాంతంలో 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పనంగా కట్టబెట్టారు. పీఠాధిపతి తనకు భూమి కావాలని అడగడంతో జగన్ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. పీఠం విస్తరిస్తాం, వేద పాఠశాల పెడతాం అని పీఠాధిపతి భూమి ఇవ్వాలని కోరారు. ఇంకేముంది కొత్తవలసలో 15 ఎకరాల భూమి కేటాయించారు. మార్కెట్ ధర ప్రకారం ఇస్తే ఫర్లేదు. తక్కువ మొత్తానికి కట్ట బెట్టి తన స్వామి భక్తిని చాటుకున్నారు సీఎం జగన్.
AP Govt: శారదా పీఠం సేవలో జగన్ సర్కార్.. 2 రోజుల్లో రూ.96 లక్షలతో తారు రోడ్డు
రూ.73 లక్షలు
కొత్తవలసలో సర్వే నంబర్ 102/2లో 7.7 ఎకరాలు, 103 సర్వే నంబర్‌లో 7.3 ఎకరాలు కేటాయించారు. మొత్తం 15 ఎకరాల భూమిని పీఠాధిపతికి కట్టబెట్టారు. బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ.25 వేల వరకు ఉంది. ఎకరం భూమి రూ.10 కోట్లకు పైగా పలుకుతోంది. జగన్ సర్కార్ మాత్రం ఎకరం రూ. లక్షగా ధర నిర్ణయించింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం రూ.73 లక్షలుగా ఉంది. అలా కూడా ఇవ్వలేదు. 15 ఎకరాల భూమిని కేవలం 15 లక్షలకు అప్పజెప్పింది. మార్కెట్ ప్రకారం ఆ భూమితో ప్రభుత్వానికి రూ.150 కోట్ల ఆదాయం సమకూరేది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. భీమిలి ప్రాంతంలో భూములకు భారీ డిమాండ్ ఉంది. వేద పాఠశాల పేరు చెప్పి తక్కువ ధరకే ప్రభుత్వం నుంచి భూమిని శారదా పీఠం తీసుకుంది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
AP Govt: శారదా పీఠం సేవలో జగన్ సర్కార్.. 2 రోజుల్లో రూ.96 లక్షలతో తారు రోడ్డు
Updated Date - Feb 21 , 2024 | 09:23 PM