YS Jagan: మరికాసేపట్లో పిన్నెల్లితో జగన్ ములాఖత్..
ABN, Publish Date - Jul 04 , 2024 | 08:49 AM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు (గురువారం) నెల్లూరుకి రానున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. దాడులు, హత్యాయత్నం కేసుల్లో రిమాండ్‌లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారు. జైలులో పిన్బెల్లితో జగన్ ములాఖత్ కావడంపై విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు (గురువారం) నెల్లూరుకి రానున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. దాడులు, హత్యాయత్నం కేసుల్లో రిమాండ్‌లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారు. జైలులో పిన్బెల్లితో జగన్ ములాఖత్ కావడంపై విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్‌లో కనపర్తిపాడుకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి హైలికాఫ్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి వెళ్లనున్నారు.
నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్టవడం, మాచర్ల కోర్టు 14 రోజులు విధించి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కాగా.. జగన్ తన సతీమణి భారతి రెడ్డితో కలిసి ఇటీవల బెంగుళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. అయితే జగన్ ఎటైనా వెళ్లి వస్తే విమానాశ్రయంలోనో లేదంటే ఆయన నివాసం వద్దో బీభత్సమైన కోలాహలం ఉంటుంది. కానీ ఆయన బెంగుళూరు నుంచి వస్తే.. ఎక్కడా కూడా ఎలాంటి కోలాహలం కనిపించలేదు. స్వాగత సన్నాహాలూ లేవు.. హంగూ ఆర్భాటాలూ అంతకు మించి లేవు. ఇక నిన్న తమ పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు.
Updated Date - Jul 04 , 2024 | 08:52 AM