ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: వర్మతో పవన్ కల్యాణ్ భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..

ABN, Publish Date - Mar 30 , 2024 | 04:33 PM

తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మతో జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు గంటపాటు చర్చించారు. నాలుగు రోజుల పవన్ పర్యటన షెడ్యూల్ పై మాట్లాడుకున్నారు.

తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మతో జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు గంటపాటు చర్చించారు. నాలుగు రోజుల పవన్ పర్యటన షెడ్యూల్ పై మాట్లాడుకున్నారు. అనంతరం హోటల్లో బస చేసేందుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. సాయంత్రం నాలుగు గంటలకు పురోహుతిక అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం వారాహి వాహనానికి పూజ చేసి, సాయంత్రం 5 గంటలకు చేబ్రోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న

వర్మతో భేటీ అయ్యాక పవన్ కల్యాణ్ స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. చంద్రబాబు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వర్మ పిలుపునిచ్చారు. ఇంతకు ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1గంటకు పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆలయం మూసివేత కారణంగా పవన్ తన పర్యటన మొత్తాన్ని మార్చుకున్నారు.

MS Dhoni: డూడుల్ పై ధోనీ రైడ్.. వీధుల్లో రయ్ రయ్.. వీడియో వైరల్..


కాగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పది నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. ఈ నెల 30 నుంచి 2వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజా నగరం నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో ఉన్న నాయకులు అందరూ సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 04:54 PM

Advertising
Advertising