ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu Row: ఆసక్తికర పరిణామం.. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వెళ్లిన కేఏ పాల్

ABN, Publish Date - Sep 25 , 2024 | 12:02 PM

లడ్డూ వ్యవహారంలో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగంచిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని నిర్ధారణ కావడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా షురూ కానుంది. ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారంలో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.


భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కోర్టుకు ఇప్పటికిప్పుడు సమయం లేదని ధర్మాసనం తెలిపింది. వచ్చే వారం రెగ్యులర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్‌కు హైకోర్ట్ ధర్మాసనం సూచించింది.


లడ్డూ అప్రవితపై పీఠాధిపతుల ఆగ్రహం

తిరుమల తిరుపతిలో లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి లడ్డూ పవిత్రతకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల పాటు ఈ లడ్డూని పీఠాధిపతులందరూ తిని ఘోరమైన అపచారం చేశామని విచారం వ్యక్తం చేశారు. ‘‘జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూ తిని ఇన్ని సంవత్సరాలు ఘోర అపచారం చేశాం. తిరుమల తిరుపతిలో గోవులను పెంచి వాటి నుంచి వచ్చే పాల ద్వారా నెయ్యిని తయారు చేసి దానిని లడ్డూ తయారీలో వాడాలని పీఠాధిపతులం విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాల జగన్ పాలనలో ఇలాంటి అవినీతికి పాల్పడడం వల్లే కోవిడ్ లాంటి మహమ్మారులను మనం చూశాం. లడ్డూ వ్యవహారంలో పాత్రధారులైన వారందరినీ ఖచ్చితంగా శిక్షించాలి. ఉరిశిక్ష విధించాలి. గత ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటలాడింది. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలి. ప్రస్తుతానికి అమరావతిలో ఉన్న పీఠాధిపతులం అందరం సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులందరం కూడా సమీక్ష ఏర్పాటు చేసుకుంటాం’’ అంటూ శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి వెల్లడించారు.

ఈ మేరకు హిందూ జేఏసీ ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత సంరక్షణ కోసం స్వామీజీలు, మాతాజీలు సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated Date - Sep 25 , 2024 | 12:15 PM