AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
ABN, Publish Date - Nov 16 , 2024 | 10:30 AM
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబక పల్లిలో రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా..
కడప : ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు సర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబక పల్లిలో రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల నుంచి పరారీలో ఉన్నఅవినాష్ పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషియల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి సైతం 41-A నోటీసులు జారీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉందని ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదురుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల్లో సైతం అవినాష్ హస్తం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక అసలు కారణం కడప ఎంపీ పీఏ నని తెలుస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీందర్ రెడ్డి ఇటీవల పోలీసులకు తెలిపారు. పీఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలుస్తుంది.
Updated Date - Nov 16 , 2024 | 10:49 AM