Kadapa : దిగొచ్చిన ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్
ABN, Publish Date - Jun 30 , 2024 | 04:06 AM
వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ రాజశేఖర్ ఎట్టకే లకు తన పదవికి రాజీనామా చేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు రాజీనామా
వైవీయూ వీసీ, రిజిస్ట్రారు కూడా..
పెదకాకాని, కడప(ఎడ్యుకేషన్)/పులివెందుల, జేఎన్టీయూకే, జూన్ 29: వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ రాజశేఖర్ ఎట్టకే లకు తన పదవికి రాజీనామా చేశారు. వర్సిటీలో శనివారం టీఎన్‌ఎస్‌ఎఫ్, జనసేన విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్‌కు తాళం వేయడంతో ఆయన దిగొచ్చి రాజీనామా చేసినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019 సెప్టెంబరులో ఇన్‌చార్జి ఉపకులప తిగా నియమితులైన రాజశేఖర్, 2022 సెప్టెంబరు 28 నుంచి రెగ్యులర్ వీసీగా నియమితులయ్యారు. ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారన్న విమ ర్శలు వచ్చాయి. వర్సిటీలో జగన్, సజ్జల పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం మొ దలు వైసీపీ ప్లీనరీ సమావేశాలకు వర్సిటీ ప్రాంగణాన్ని వాహనాల పార్కింగ్ కేటా యించే వరకు ఎన్నోరకాలుగా ఊడిగం చేశారు.
ఇన్ని ఘనకార్యాలకు పాల్పడిన రాజశేఖర్, ఇంకా ఎలా కొనసాగుతారని వీసీ తీరును నిరసిస్తూ శనివారం టీఎన్ ఎస్‌ఎఫ్, జనసేన విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. అనంతరం విద్యార్థులు వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం వీసీ చాంబర్‌కు తాళాలు వేశారు. దీంతో దిగివచ్చిన వీసీ రాజశేఖర్ తన పదవి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు, ఉన్నతాధికారులకు లేఖ పంపించారు. ఈ ఆందోళనలో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు నితీష్‌యాదవ్, జనసేన అధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక, కాకినాడ జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి సోమవారం రాజీనామా చేయనున్నట్లు వర్సి టీ పీఆర్వో సీహెచ్ సాయిబాబు శనివారం మీడియాకు తెలిపారు. అలాగే, యోగివేమన యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వైపీ వెంకటసుబ్బయ్య తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే, వైవీయూ నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కొనసాగిన వైఎస్ భారతి సమీప బంధువు సురేంద్రనాధరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈయన తిరిగి మాతృసంస్థ అయిన వైవీయూలో ప్రొఫెసరుగా జాయిన్ అయ్యారు.
జీఏడీలో రిపోర్ట్ చేయాలని పాడా ఓఎస్డీకి ఆదేశం
వైసీపీ ప్రభుత్వంలో పాడా ఓఎస్డీగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని శనివారం రాష్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, కడప ఆర్జేడీ రాఘవరెడ్డి అవినీతి అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని డీఈవో అనురాధ తెలిపారు.
Updated Date - Jun 30 , 2024 | 04:06 AM