విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు : కలెక్టర్
ABN, Publish Date - Sep 03 , 2024 | 11:01 PM
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప విమా నాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కమిటీ చైర్మన, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు.
కడప(కలెక్టరేట్) సెప్టెంబరు 3: పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప విమా నాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కమిటీ చైర్మన, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. మంగళవారం కడప విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఏరోడ్రమ్, ఎయిర్‌ఫీల్డ్, ఎన్విరాన్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ఈసందర్భంగా సేఫ్టీ, సెక్యూరిటీలకు సంబంధించిన పలు విషయాలను, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన సేవా రంగంలో ప్రయాణికుల అనుభవాలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ విమానాశ్రయాలను ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి ధీటుగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగు పరుస్తోందన్నారు. కడప విమానాశ్రయం నుంచి భవిష్యత్తులో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి భారతీయ విమానాశ్రయాల ప్రాఽధికార సంస్థ తగు చర్యలు చేపట్టిందన్నారు. రూ.266 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన టెర్మినల్ భవన అభివృద్ధి పనుల అనంతరం కడప విమానాశ్రయం ఒక అపురూపమైన జవసత్వాలు సంతరించుకోనుందన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, పోలీసు శాఖలు జాయింట్ కమిటీగా ఏర్పాటై.. అందుకు సంబంధించిన రోడ్లు, రవాణా వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఏపీఎస్పీఎ్‌సలో భాగంగా కొరత ఉన్న సిబ్బందిని నియమించడం జరుగుతోందన్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాలను శుభ్రంగా, అహ్లదకరంగా ఉంచడంలో కడప కమిషనరు, పంచాయితీరాజ్ శాఖలు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. సుందరంగా తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్థన రాజు, డీఎ్‌ఫఓ సందీప్ రెడ్డి, విమానాశ్ర యం డైరెక్టర్, కమిటీ కన్వీనరు సుజితకుమార్ పోదర్, కాషో ఆనందయ్య, అదనపు మున్సిపల్ కమిషనరు రాకేష్‌చంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 03 , 2024 | 11:01 PM