make the rally అగ్నివీర్‌ ర్యాలీని విజయవంతం చేయాలి

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:35 PM

జిల్లా కేంద్రంలో నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూ ట్మెంట్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ అధికారులను ఆదేశించారు.

make the rally  అగ్నివీర్‌ ర్యాలీని విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న కల్నన పునీతకుమార్‌, పక్కన కలెక్టర్‌ శివశంకర్‌

కడప(కలెక్టరేట్‌) సెప్టెంబరు 18: జిల్లా కేంద్రంలో నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూ ట్మెంట్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ ఎస్‌ హాల్లో ఇండియన ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నన పునీతకుమార్‌, ఎస్పీ హర్షవర్ధనరాజు, జేసీ అదితి సింగ్‌, రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఆఫీసరు మేజర్‌ అమర్‌ దీప్‌కుమార్‌, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తో కలసి కలెక్టర్‌ దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకంలో భాగంగా అగ్నివీర్‌ ఆర్మీలో జాయిన అయ్యే వారి కోసం ఇప్పటికే రాతలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వ హించేందుకు జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియం వేది కగా మారనుందన్నారు. ఈ ఫిజికల్‌ టెస్ట్‌కు రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు. వారందరికీ మౌలిక సదు పాయాలను కల్పించడంలో కడప నగర పాలకసంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. సంబంధిత ఇంజనీ రింగ్‌ అధికారుల సమన్వయంతో మైదానంలో రిక్రూట్‌మెంట్‌ బోర్డ్డు విధివిధానాలకు అనుగుణంగా టెంట్లు, బారికేడ్లు, విద్యుత, తాగు నీరు, టాయిలెట్స్‌ తదితర మౌలిక ఏర్పాట్లను సమకూర్చా లన్నారు. శాంతిభద్రతలు, పారిశుధ్యం తదితర అంశాలపై సంబంఽ దిత అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు జారీ చేశారు. అక్టో బరు 15వ తేదీ లోపు మౌలిక ఏర్పాట్లను సమకూర్చుకోవాలన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనరు నందన, జిల్లా ఫైర్‌ ఆఫీసరు ధర్మారావు, డీటీసీ మీరాప్రసాద్‌, డీఎంఅడ్‌హెచఓ డాక్టర్‌ నాగ రాజు, ఆర్‌అండ్‌బీ డీఈ మాధవి, పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 11:35 PM

Advertising
Advertising